Telugu Global
Cinema & Entertainment

టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయిన ఆర్ఆర్ఆర్

తొలిసారి టీవీల్లో ప్రసారమైన ఆర్ఆర్ఆర్ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో రేటింగ్ వచ్చింది. కానీ బుల్లితెర టీఆర్పీ రికార్డుల్ని మాత్రం ఈ సినిమా క్రాస్ చేయలేకపోయింది.

టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయిన ఆర్ఆర్ఆర్
X

థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్టయిన ఆర్ఆర్ఆర్ సినిమా, బుల్లితెరపై మాత్రం ఆ మేజిక్ క్రియేట్ చేయలేకపోయింది. చెప్పుకోడానికి ఈ సినిమాకు భారీ రేటింగ్ వచ్చినప్పటికీ, టాప్-10 టీఆర్పీ లిస్ట్ లో అగ్రస్థానం మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ మాటకొస్తే.. రాజమౌళి గత చిత్రం బాహుబలి-2ను కూడా క్రాస్ చేయలేకపోయింది ఆర్ఆర్ఆర్ మూవీ.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మాలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రసారం చేస్తే, తొలి ఎయిరింగ్ లో ఈ మూవీకి 19.62 రేటింగ్ వచ్చింది. ఇది పెద్ద టీఆర్పీనే. కానీ రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్ మాత్రం కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం టీఆర్పీలో నంబర్ వన్ స్థానంలో అల వైకుంఠపురములో, రెండో స్థానంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలున్నాయి. ఇలా చూసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీకి టాప్-10లో కూడా చోటు దక్కలేదు.

టాప్-10 లిస్ట్ లో చివరి స్థానంలో మహానటి నిలిచింది. ఆ స్థాయి రేటింగ్ ను కూడా ఆర్ఆర్ఆర్ అందుకోలేకపోయింది. బార్క్ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యథిక టీఆర్పీ పొందిన టాప్-10 సినిమాల లిస్ట్ ఇదే...

1. అల వైకుంఠపురములో - 29.4 (జెమినీ)

2. సరిలేరు నీకెవ్వరు - 23.4 (జెమినీ)

3. బాహుబలి 2 - 22.7 (స్టార్ మా)

4. పుష్ప - 22.54 (స్టార్ మా)

5. శ్రీమంతుడు - 22.54 (జీ తెలుగు)

5. దువ్వాడ జగన్నాధమ్ - 21.7 (జీ తెలుగు)

6. బాహుబలి - 21.54 (స్టార్ మా)

7. ఫిదా - 21.31 (స్టార్ మా)

8. గీతగోవిందం - 20.8 (జీ తెలుగు)

9. జనతా గ్యారేజ్ - 20.69 (స్టార్ మా)

10. మహానటి - 20.21 (స్టార్ మా)

First Published:  26 Aug 2022 12:32 PM GMT
Next Story