Telugu Global
Cinema & Entertainment

తెలుగు ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పిన కాంతారా హీరో

కాంతార సినిమా తెలుగులో కూడా సక్సెస్ అయింది. 3 రోజుల్లో 20 కోట్లు వచ్చాయి. అలా తెలుగులో తొలిసారి సక్సెస్ అందుకున్నాడు రిషబ్ శెట్టి.

తెలుగు ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పిన కాంతారా హీరో
X

కన్నడ నాట సూపర్ హిట్టయిన కాంతార సినిమా అదే పేరుతో తెలుగులోకి కూడా డబ్ అయింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా హిట్టయింది. దీంతో ప్రత్యేకంగా తెలుగులో ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి కాంతారా హీరో-దర్శకుడు రిషబ్ శెట్టి హాజరయ్యాడు. తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

"మా కాంతార సినిమాను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ షార్ట్ టైమ్ లో "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు. రిలీజైన ప్రతిచోటా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు మంచి ఎనర్జీ ఇచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. 3 రోజుల్లో 20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదములు."

ఇలా టాలీవుడ్ ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు రిషబ్. ఇప్పటికే పరభాషా నటులు కొంతమంది టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ కాంతార సినిమాతో రిషబ్ కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు. త్వరలోనే ఇతడు నటించిన పాత కన్నడ సినిమాలు తెలుగులోకి డబ్ అవ్వడం గ్యారెంటీ.

అన్నట్టు గీతాఆర్ట్స్ బ్యానర్ పై రిషబ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు.

First Published:  20 Oct 2022 4:23 AM GMT
Next Story