Telugu Global
Cinema & Entertainment

Regina - ఎట్టకేలకు రెజీనా సినిమాకు మోక్షం

Regina's Nenena - ఎట్టకేలకు రెజీనా సినిమాకు మోక్షం కలిగింది. ఈ నెల్లోనే థియేటర్లలోకి రానుంది 'నేనేనా' మూవీ.

Regina - ఎట్టకేలకు రెజీనా సినిమాకు మోక్షం
X

2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించింది.

ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో "సూర్పనగై" అనే సినిమా చేసింది రెజీనా. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం. ఈ నెల చివరివారంలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది.

నిజానికి ఈ సినిమా చాన్నాళ్ల కిందటే రెడీ అయింది. కానీ సరైన మార్కెట్ లేక ఇన్నాళ్లూ సినిమాను ఆపారు. ఓ టైమ్ లో డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద కూడా సినిమాను ఇచ్చేద్దాం అనుకున్నారు మేకర్స్. కానీ అది కూడా సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

First Published:  6 July 2023 1:40 PM GMT
Next Story