Telugu Global
Cinema & Entertainment

Nenena Movie | రెజీనా సినిమా రిలీజ్ కు రెడీ

Regina's Nenena Movie - రెజీనా లీడ్ రోల్ పోషించిన నేనేనా మూవీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

Nenena Movie | రెజీనా సినిమా రిలీజ్ కు రెడీ
X

2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకుంది.

రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో "సూర్పనగై" అనే సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ, అలీ ఖాన్, జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది.

అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. నేనేనా సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ దక్కింది.

ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది రెజీనా. ఈ సినిమా సక్సెస్ తో మరోసారి టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది. మూవీలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు.

First Published:  4 Aug 2023 4:07 PM GMT
Next Story