Telugu Global
Cinema & Entertainment

Regina - ఎట్టకేలకు రెజీనా సినిమాకు మోక్షం

Regina Nene Na Movie - రెజీనా నటించిన తాజా చిత్రం నేనేనా. చాన్నాళ్ల కిందటే రెడీ అయిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

Regina - ఎట్టకేలకు రెజీనా సినిమాకు మోక్షం
X

ఎస్పీ సినిమాస్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నిర్మాణ - పంపిణీ సంస్థలలో ఒకటిగా పేరుపొందింది. ఇప్పుడీ సంస్థ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. రెజీనా లీడ్ రోల్ పోషించిన సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది.

రెజీనా ప్రధాన పాత్రలో, నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో, ఆపిల్ ట్రీ స్టూడియోస్‌ రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన ‘నేనే నా’ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ & నాన్-థియేట్రికల్ రైట్స్ ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. రాజ శేఖర్ ఇంతకుముందు సూపర్‌హిట్ చిత్రం ‘జాంబీ రెడ్డి’ని నిర్మించారు.

‘నేనే నా’ సినిమా 1920 కాలం, ప్రస్తుతం కాలం మధ్య సాగుతుంది. రెండు విభిన్న కాలాల నేపథ్యంలో సెట్ చేసిన ఫాంటసీ-అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది. రెజీనా ఒక పురావస్తు శాస్త్రవేత్త పాత్రను పోషించింది. ఈ సినిమా ఫస్ట్ కాపీ చాన్నాళ్ల కిందటే రెడీ అయింది. ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది.

వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, అక్షర గౌడ, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకురాబోతోంది రెజీనా మూవీ.

First Published:  25 Feb 2023 12:15 PM GMT
Next Story