Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | ఆగస్ట్ 15 డేట్ వెనక మెయిన్ రీజన్

Pushpa 2 - పుష్ప-2 సినిమా విడుదల తేదీ వెనక చాలా పెద్ద కారణం ఉంది. అదేంటో చూద్దాం..

Pushpa 2 | ఆగస్ట్ 15 డేట్ వెనక మెయిన్ రీజన్
X

బన్నీ హీరోగా నటిస్తున్న పుష్ప-2 సినిమా కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. పుష్ప సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఇప్పుడీ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. అన్నీ వదిలేసి, ఈ సినిమా ఆగస్ట్ వరకు ఎందుకు వెళ్లింది? మరీ ముఖ్యంగా ఆగస్ట్ 15న రిలీజ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా?

పుష్ప-2 సినిమాను ఏకంగా ఆగస్ట్ వరకు తీసుకెళ్లడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసొస్తోంది. ఆగస్ట్ 15 గురువారం పడింది. ఆ తర్వాత శని, ఆదివారాలు వీకెండ్. ఆ తర్వాత సోమవారం రక్షాబంధన్ పడింది. ఇలా 5 రోజుల లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసొచ్చింది.

పుష్ప-2 సినిమాకు ఆ తేదీ ఎనౌన్స్ చేయడం వెనక ఇలా చాలా పెద్ద రీజన్ ఉంది. పెద్ద సినిమాలన్నింటినీ పండగలు లేదా లాంగ్ వీకెండ్ లో రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇప్పుడా ఆనవాయితీని పుష్ప-2 కూడా కొనసాగించింది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  13 Sep 2023 5:22 PM GMT
Next Story