Telugu Global
Cinema & Entertainment

Animal Movie | యానిమల్ టైటిల్ వెనక లాజిక్ ఇదే!

Animal - రణబీర్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాకు యానిమల్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? సందీప్ రెడ్డి ఏమంటున్నాడు?

Animal Movie | యానిమల్ టైటిల్ వెనక లాజిక్ ఇదే!
X

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్'. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ క‌పూర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించింది.

అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను టీ-సిరీస్ నిర్మించింది. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా యానిమల్ అనే టైటిల్ గురించి వివరించాడు.

"మనకి చదువు, తెలివితేటలు వచ్చి హ్యూమన్ బీయింగ్ అని పేరుపెట్టుకున్నాం. అయితే మేన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనకి ఐక్యూ ఉండి, కమ్యునికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్ లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించాం. కానీ అవి లేకపోతే యానిమల్ కదా అనేది నా పర్శనల్ ఫీలింగ్. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకునప్పుటి నుంచి అలానే అనిపించేది. అయితే నేను అలోచించింది ఏంటంటే.. యానిమల్ కు ఐక్యు ఉండదు. తన ప్రవృత్తి తో ప్రవర్తిస్తుంటుంది. ఇందులో హీరో పాత్ర కూడా అప్పటికప్పుడు అనిపించింది బిహేవ్ చేస్తుంది. అలాంటి పాత్రకు సంబంధించిన కథ కాబట్టి ‘యానిమల్’ అనే టైటిల్ బాగుంటుందని ఈ పేరు పెట్టడం జరిగింది."

ఇలా యానిమల్ టైటిల్ పెట్టడం వెనక లాజిక్ ను బయటపెట్టాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా తర్వాత అతడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు.

First Published:  26 Nov 2023 1:16 PM GMT
Next Story