Telugu Global
Cinema & Entertainment

Tiger Nageswar Rao - రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రెడీ

Tiger Nageswar Rao - రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ రెడీ అయింది.

Tiger Nageswar Rao - రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రెడీ
X

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ యేడాది విడుదకాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఒకటి. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది.

తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ మే 24న విడుదల కానుంది.

టైగర్ నాగేశ్వరరావు 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురం లోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తొలిసారి మేకోవర్ అయ్యాడు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటాడట. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు.

ఈ సినిమా కోసం 5 ఎకరాల స్థలంలో స్టువర్టుపురం గ్రామాన్ని రీక్రియేట్ చేశారు. చిత్రానికి మదీ సినిమాటోగ్రాఫర్ కాగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది.

First Published:  15 May 2023 1:42 PM GMT
Next Story