Telugu Global
Cinema & Entertainment

Ravanasura - రావణాసుర టీజర్ రెడీ

Raviteja's Ravanasura - రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ మూవీ టీజర్ రెడీ అయింది.

Ravanasura - రావణాసుర టీజర్ రెడీ
X

మాస్ రాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “రావణాసుర”. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను అనుకున్న సమయానికి పూర్తిచేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ ను మార్చి 6వ తేదీన ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ ట్రెండీగా, విలనీ లుక్ లో కనిపిస్తున్న ఇంటెన్స్ పోస్టర్ ద్వారా ఈ ప్రకటన చేశారు.

భారీ బడ్జెట్ తో వస్తోంది రావణాసుర చిత్రం. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుండి ఇప్పటికే 2 సాంగ్స్ వచ్చాయి.

శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ అందించగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు.

సమ్మర్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటైన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది.

First Published:  2 March 2023 9:24 AM GMT
Next Story