Telugu Global
Cinema & Entertainment

Ravanasura: రావణాసుర ఆంధెమ్ సాంగ్ లాంచ్

Raviteja's Ravanasura - రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది.

Ravanasura: రావణాసుర ఆంధెమ్ సాంగ్ లాంచ్
X

రవితేజ, సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు.

తాజాగా రావణాసుర’ థీమ్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్ హైలీ ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. ‘రావణ’ అనే లిరిక్స్ తో మొదలైన ట్రాక్ జోష్ ఫుల్ గా ఉంది. పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్ ను ఎనర్జిటిక్ గా అలపించారు.

పాట చరణంలో వినిపించిన శివతాండవం ఎట్రాక్ట్ చేసింది. మేకర్స్ విడుదల చేసిన ఈ పవర్ ఫుల్ థీమ్ సాంగ్ తో ‘రావణాసుర’ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే గ్లింప్స్‌ కు మంచి స్పందన వచ్చింది. రవితేజ ఇందులో లాయర్ గా కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఏప్రిల్ 7న వేసవిలో రావణాసురు థియేటర్స్ లోకి గ్రాండ్‌గా విడుదల కానుంది.



First Published:  7 Feb 2023 4:19 AM GMT
Next Story