Telugu Global
Cinema & Entertainment

Ravanasura First Glimpse - రావణాసుర సినిమా గ్లింప్స్ విడుదల

Raviteja's Ravanasura First Glimpse - ఈరోజు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా రావణాసుర సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.

Ravanasura First Glimpse - రావణాసుర సినిమా గ్లింప్స్ విడుదల
X

ధమాకా, వాల్తేరు వీరయ్యలో రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించిన మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తన తాజా చిత్రం ‘రావణాసుర’ లో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది.

రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్ ఈ చిత్రంలో రవితేజ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ ని విడుదల చేశారు. రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించాడు. లాయర్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే మరో గెటప్‌లో స్టైలిష్‌గా ఆకట్టుకున్నాడు. రెండు గెటప్‌లలో సిగార్ తాగుతూ కనిపించారు.

ఓ అజ్ఞాత వ్యక్తి అమ్మాయిలను చంపడం కూడా వీడియోలో కనిపిస్తుంది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. రవితేజ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పకనే చెబుతోంది.

సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించాడు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. హీరోయిన్లు.

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7న వేసవిలో రావణాసురు థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.



First Published:  26 Jan 2023 10:52 AM GMT
Next Story