Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్స్

Mr Bachchan - హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Mr Bachchan | మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్స్
X

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ కోసం కరైకుడికి వెళ్ళింది యూనిట్. ఈ షెడ్యూల్‌లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ 'నామ్ తో సునా హోగా'. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పవన్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పక్కనపెట్టి మరీ హరీశ్ శంకర్ ఈ సినిమా చేస్తున్నాడు. అటు రవితేజ కూడా ఓ సినిమాను కాదని, ఈ ప్రాజెక్టు పైకి వచ్చాడు.

First Published:  25 Jan 2024 5:27 PM GMT
Next Story