Telugu Global
Cinema & Entertainment

Mr Bachchan | మాస్ రాజా 'మిస్టర్ బచ్చన్' మొదలైంది

Mr Bachchan - రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్. ఈగల్ సినిమా ఇలా పూర్తిచేసి, అలా మిస్టర్ బచ్చన్ లొకేషన్ లో వాలిపోయాడు ఈ హీరో.

Mr Bachchan | మాస్ రాజా మిస్టర్ బచ్చన్ మొదలైంది
X

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్'. 10 రోజుల కిందట ఈ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ రెగ్యులర్ షూట్ మొదలైంది.

రవితేజ మొదటి రోజు షూట్‌లో పాల్గొన్నాడు. సీన్ 6, షాట్ 34తో టీమ్ షూటింగ్ ప్రారంభించింది. రవితేజ స్వయంగా షేర్ చేసిన ఫోటోలో కొంతమంది వ్యక్తులతో కలిసి కనిపించారు. క్లాప్‌బోర్డ్ అతని ముఖాన్ని కవర్ చేసి ఉంది. ఈ భారీ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ 'నామ్ తో సునా హోగా'. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ధమాకా, ఈగల్ తర్వాత పీపుల్ మీడియాలో రవితేజ నటిస్తున్న మూడో చిత్రమిది.

First Published:  29 Dec 2023 4:54 PM GMT
Next Story