Telugu Global
Cinema & Entertainment

Eagle Movie | రవితేజ ఈగల్ మూవీ అప్ డేట్స్

Eagle Movie - ఈగల్ మూవీ షూట్ కోసం యూనిట్ మరోసారి లండన్ వెళ్లింది. రవితేజ త్వరలోనే జాయిన్ అవుతాడు.

Eagle Movie | రవితేజ ఈగల్ మూవీ అప్ డేట్స్
X

ప్రస్తుతం రవితేజ చేతిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాల్లో ఒకటి ఈగల్. ఓవైపు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తూనే, మరోవైపు ఈగల్ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు రవితేజ. ఇప్పుడీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది.

ఈగల్ సినిమా కోసం యూనిట్ మరోసారి లండన్ వెళ్లబోతోంది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర విశేషాన్ని చెప్పుకోవాలి. నిజానికి ఈగల్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రం పెండింగ్ ఉంది. దాన్ని లోకల్ గానే షూట్ చేసి ఎడిటింగ్ లో అతికించొచ్చు.

కాకపోతే, ఈగల్ సినిమా విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉంది. సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో, అలా పక్కన పెట్టారు. ఎలాగూ టైమ్ ఉంది కాబట్టి, ప్యాచ్ వర్క్ కూడా లండన్ లోనే చేయాలని నిర్ణయించుకుంది యూనిట్.

ఈ మేరకు యూనిట్ మరోసారి లండన్ వెళ్లింది. మరో 2-3 రోజుల్లో రవితేజ కూడా యూనిట్ తో జాయిన్ అవుతాడు. ఇలా ప్యాచ్ వర్క్ కోసం విదేశాలకు వెళ్లిన చిత్రంగా ఈగల్ నిలుస్తుంది.

కార్తీక్ ఘట్టమనేని డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.

First Published:  19 Aug 2023 5:32 PM GMT
Next Story