Telugu Global
Cinema & Entertainment

Eagle | రవితేజ సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్

Eagle Movie - రవితేజ తాజా చిత్రం ఈగిల్. ఈ మూవీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 50 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది.

Eagle | రవితేజ సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్
X

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ థియేట్రికల్ రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈగల్ నుంచి రవితేజ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌లో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించాడు. స్టైలిష్‌ డ్రెస్సింగ్ లో చాలా ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ తో క్యూరియాసిటీ పెంచింది. కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు. సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటించింది. నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషించారు.

కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. దావ్‌జాంద్ సంగీతం అందిస్తున్నాడు. ధమాకా తర్వాత పీపుల్ మీడియా బ్యానర్ పై రవితేజ చేస్తున్న సినిమా ఇదే.

First Published:  24 Nov 2023 5:22 PM GMT
Next Story