Telugu Global
Cinema & Entertainment

Eagle Movie - సంక్రాంతికి రవితేజ నుంచి మరో సినిమా

Eagle Movie - రవితేజ కొత్త సినిమా సంగతులు బయటకొచ్చాయి. సినిమా టైటిల్ తో పాటు, రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.

Eagle Movie - సంక్రాంతికి రవితేజ నుంచి మరో సినిమా
X

మాస్ మహారాజా రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందించిన ‘ధమాకా’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌ అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్న మాసీవ్ ప్రాజెక్ట్ కోసం రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.

రవితేజ మోస్ట్ వాంటెడ్ పెయింటర్. అతన్ని పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెదుకుతుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి.. అతను పత్తి పండించే రైతు అని చెబుతాడు. తనకి ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. చివరగా రవితేజ ఒక సరస్సు దగ్గర నిలబడి పాక్షికంగా తన ముఖాన్ని చూపిస్తారు. ఆ తర్వాత ‘ఈగల్’ అనే టైటిల్‌ని రివీల్ చేశారు.

టైటిల్ ప్రజెంటేషన్ బాగుంది. గ్లింప్స్ హీరో ప్రపంచాన్ని చూపించింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్ , మధుబాల వంటి తారాగణం నటిస్తోంది. కావ్యా థాపర్‌ మరో హీరోయిన్. విజువల్స్ తో పాటు, నేపధ్యం సంగీతం బాగున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్లింప్స్ ద్వారా నిర్మాతలు ఈగల్‌ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇంతకుముందు రవితేజ నటించిన క్రాక్ సినిమా సంక్రాంతికే వచ్చి పెద్ద హిట్టయింది.



First Published:  13 Jun 2023 1:51 AM GMT
Next Story