Telugu Global
Cinema & Entertainment

Raviteja: మరో 4 రోజుల్లో ధమాకా ట్రయిలర్

Raviteja's Dhamaka: రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ధమాకా. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది. మరో 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది.

Raviteja: మరో 4 రోజుల్లో ధమాకా ట్రయిలర్
X

రవితేజ హీరోగా, త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ధమాకా'. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ మొదలైంది. పాటలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమోషన్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లనుంది. ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించారు.

డిసెంబర్ 15న ధమాకా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో రవితేజ క్లాస్ అవతార్‌లో సూట్‌ వేసుకొని కళ్లజోడుతో కనిపించాడు. ఇందులో క్లాస్ , మాస్ అవతార్‌లో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. రెండు పాత్రలూ వేటికవే వినోదాత్మకంగా ఉండబోతున్నాయి. సినిమాలో యాక్షన్, ఇతర అంశాలతో పాటు హై ఎంటర్ టైన్మెంట్ ఉండబోతుంది.

శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న' ధమాకా' సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

ధమాకా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది.

First Published:  11 Dec 2022 10:58 AM GMT
Next Story