Telugu Global
Cinema & Entertainment

ధమాకా టీజర్ రెడీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా నుంచి టీజర్ రాబోతోంది.

ధమాకా టీజర్ రెడీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

అప్పుడే మరో మూవీ రెడీ చేశాడు రవితేజ. చకచకా సినిమాలు పూర్తిచేసే ఈ దర్శకుడు, ఇప్పుడు ధమాకా అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ రాజా సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూపించే రొమాంటిక్ గ్లింప్స్‌ను ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 21, ఉదయం 10:01 గంటలకు మాస్ క్రాకర్ పేరిట టీజర్ ని రిలీజ్ చేస్తారు. టీజర్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రెండు వేర్వేరు పోస్టర్లను విడుదల చేశారు. ఒక పోస్టర్ రొమాంటిక్ సైడ్ అయితే, మరొకటి యాక్షన్ మార్క్ తో ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

'డబుల్ ఇంపాక్ట్' అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దాదాపు పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులంతా నటిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో ధమాకా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.







First Published:  7 Oct 2022 6:45 AM GMT
Next Story