Telugu Global
Cinema & Entertainment

Ravanasura - రావణాసుర నుంచి రవితేజ పాడిన పాట రిలీజ్

Raviteja ravanasura - రావణాసుర సినిమా కోసం పాట పాడాడు రవితేజ. తాజాగా ఆ సాంగ్ రిలీజ్ చేశారు

Ravanasura - రావణాసుర నుంచి రవితేజ పాడిన పాట రిలీజ్
X

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల హై-ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' విడుదలకు సిద్ధమవుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా, రవితేజ నిర్మాతలు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మొదటి పాట ఇప్పటికే సంచలనం సృష్టించింది. తాజాగా రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. ఈ బ్రేక్-అప్ సాంగ్ డైనమిక్ గా ఉంది. రవితేజ కూడా ఈ పాటను డైనమిక్‌గా ఆలపించాడు. కాసర్ల శ్యామ్ అందించిన హార్ట్ బ్రేక్ లిరిక్స్ రవితేజ భావాలను చక్కగా ఆవిష్కరించింది.

రవితేజ, ఫరియా అబ్దుల్లా, శ్రీరామ్‌ మధ్య వచ్చే నడిచే సీన్ ని కలర్‌ఫుల్ గా అద్భుతమైన విజువల్స్ తో చూపించారు. పబ్ సెట్ చాలా గ్రాండ్ గా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, రవితేజ డ్యాన్స్‌లు మరో పెద్ద ఆకర్షణ.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నారు.



First Published:  19 Feb 2023 4:16 PM GMT
Next Story