Telugu Global
Cinema & Entertainment

Ravanasura - రావణాసుర అందరితో విజిల్స్ వేయిస్తుందంట

Raviteja Ravanasura - రావణాసుర సినిమాపై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నాడు.

Ravanasura - రావణాసుర అందరితో విజిల్స్ వేయిస్తుందంట
X

సాధారణంగా తన సినిమాల గురించి గొప్పగా మాట్లాడడు రవితేజ. ఓ ప్రయత్నం చేశాం, ఆదరించండి అని మాత్రమే అంటాడు. కొత్తగా ట్రై చేశాం, రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉందని చెబుతుంటాడు. కానీ రావణాసుర విషయంలో మాత్రం రవితేజ చాలా నమ్మకంతో ఉన్నట్టున్నాడు. అందుకే సినిమా గురించి ముందే మాట్లాడుతున్నాడు.

రావణాసుర సినిమా కచ్చితంగా హిట్టవుతుందని అంటున్నాడు రవితేజ. ఏప్రిల్ 7న థియేటర్లలో అంతా విజిల్స్ వేస్తారని నమ్మకంగా చెబుతున్నాడు.

"ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఏప్రిల్ 7 థియేటర్స్ లో ఇరగదీసేద్దాం. మాములుగా ఉండదు. సౌండ్ దద్దరిల్లుతుంది." అంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు రవితేజ.

కెరీర్ లో తొలిసారి సుధీర్ వర్మతో కలిసి పనిచేసిన రవితేజ, అతడు పాన్ ఇండియా లెవెల్ కు ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది రావణాసుర సినిమా. వాల్తేరు వీరయ్య, ధమాకా సక్సెస్ ల తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఇది.

First Published:  2 April 2023 2:06 PM GMT
Next Story