Telugu Global
Cinema & Entertainment

మాస్ రాజా విడుదల చేసిన మట్టి కుస్తీ.. మాస్ లుక్

రవితేజ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా మట్టి కుస్తీ. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

మాస్ రాజా విడుదల చేసిన మట్టి కుస్తీ.. మాస్ లుక్
X

మట్టి కుస్తీ అనే సినిమాతో రవితేజ, పూర్తిస్థాయి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. విష్ణువిశాల్ హీరోగా ఈ సినిమా నిర్మిస్తున్నాడు రవితేజ. హీరోగా నటిస్తూనే, ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు విష్ణు విశాల్. చెల్ల అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొట్టమొదటి వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

టైటిల్ సూచిస్తునట్లుగా ఈ గ్లింప్స్ లో విష్ణు విశాల్ ను రెజ్లర్ గా పరిచయం చేశారు. విష్ణు విశాల్ బైక్ నడుపుతూ విలన్స్ ని కొడుతూ పవర్ ఫుల్ గా కనిపించాడు. చివర్లో రెజ్లింగ్ రింగ్‌లో తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు.

మట్టి కుస్తీ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో రూపుదిద్దుకుంటుంది. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు ఈ సినిమా. ఇందులో మాస్ ఎలిమెంట్స్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయంటున్నాడు దర్శకుడు.

ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న ఎడిటర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అదే రోజు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తారు.



First Published:  19 July 2022 3:50 AM GMT
Next Story