Telugu Global
Cinema & Entertainment

'రామారావు'పై రవితేజ కామెంట్స్ ఇవే

రామారావు ఆన్ డ్యూటీ.. రవితేజ కొత్త సినిమా. మాస్ రాజా ఈ సినిమా చేయడానికి రీజన్స్ ఏంటి? అంతగా నచ్చిన అంశాలేంటి?

రామారావుపై రవితేజ కామెంట్స్ ఇవే
X

మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది రామారావు ఆన్ డ్యూటీ సినిమా. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. పాటలు క్లిక్ అవ్వకపోయినా, ట్రయిలర్ ఆకట్టుకోవడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఇప్పుడీ సినిమాపై రవితేజ స్పందించాడు. రామారావు సినిమాను తను ఎందుకు చేశాడో చెప్పుకొచ్చాడు.

"రామారావు ఆన్ డ్యూటీ' నాకు చాలా డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. కూల్, పాజిటివ్ పర్శన్. అలాంటి వారితో ఎన్ని సినిమాలైన చేయడానికి నేను రెడీ. అందుకే ఈ సినిమా చేశాను."

ఇలా రామారావు సినిమా చేయడం వెనక రీజన్ ను బయటపెట్టాడు రవితేజ. ఇక వేణుకు సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టాడు. స్వయంవరం సినిమాలోనే వేణు-రవితేజ కలిసి నటించాల్సిందంట. అప్పుడు అది కుదరలేదని, ఇన్నాళ్లకు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో నెరవేరిందని చెప్పుకొచ్చాడు.

రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించాడు. శామ్ సీఎస్ సంగీతం అందించాడు. జులై 29న థియేటర్లలోకి రానుంది రామారావు ఆన్ డ్యూటీ సినిమా.

First Published:  25 July 2022 1:05 PM GMT
Next Story