Telugu Global
Cinema & Entertainment

Ravi Teja New Movie: రవితేజ మరో ప్రయోగం చేయబోతున్నాడా?

Raviteja, Prasanth Varma Movie: రవితేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో మూవీకి రంగం సిద్ధం అవుతోంది.

Ravi Teja New Movie: రవితేజ మరో ప్రయోగం చేయబోతున్నాడా?
X

ఓ సక్సెస్ వచ్చిన ప్రతిసారి ప్రయోగాలు చేస్తుంటాడు రవితేజ. తనలో ఉన్న నటుడ్ని సంతృప్తి పరచడం కోసం ఔట్ ఆఫ్ ది బాక్స్ కథల్ని ఎంచుకుంటాడు. తాజాగా థమాకాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ రాజా, ఇప్పుడు మరోసారి డిఫరెంట్ స్టోరీని సెలక్ట్ చేసుకునే దిశగా పావులు కదుపుతున్నాడు.

విలక్షణమైన కథలు, కథనానికి పెట్టింది పేరైన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి.

జాంబిరెడ్డి, కల్కి లాంటి డిఫరెంట్ మూవీస్ తీశాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా హనుమాన్ అనే మైథలాజికల్ ఫాంటసీ సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రవితేజ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు రవితేజను ఎవ్వరూ చూపించని డిఫరెంట్ షేడ్ లో ప్రజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ.

రవితేజ, ప్రశాంత్ వర్మ మధ్య మంచి పరిచయం ఉంది. ప్రశాంత్ వర్మ తొలి సినిమా అ!కు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దాన్ని వాయిస్ ఓవర్ అనడం కంటే, ఓ పాత్రకు డబ్బింగ్ అనుకోవచ్చు. అప్పట్నుంచి రవితేజతో టచ్ లోనే ఉన్నాడు ప్రశాంత్. ప్రస్తుతం ఈగల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు రవితేజ. త్వరలోనే ప్రశాంత్ వర్మ ప్రాజెక్టుపై క్లారిటీ వస్తుంది.

First Published:  23 Jan 2023 3:03 PM GMT
Next Story