Telugu Global
Cinema & Entertainment

Dhamaka: మరో ఫ్లాప్ సాంగ్ వచ్చేసింది

Raviteja Dhamaka Movie - రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ధమాకా. ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది. ఇది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Dhamaka: మరో ఫ్లాప్ సాంగ్ వచ్చేసింది
X

ధమాకా విషయంలో మొత్తం రివర్స్ లో జరుగుతోంది. రోజురోజుకు ఈ సినిమాపై అంచనాలు పెరగాల్సింది పోయి, తగ్గిపోతున్నాయి. దీనికి కారణం ఈ సినిమా నుంచి విడుదల చేస్తున్న పాటలే.

మొట్టమొదటిగా విడుదల చేసిన సాంగ్ మాత్రమే ఓ మోస్తరు హిట్టయింది. అది తప్పితే, మిగతా పాటలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. ఒక్కటి కూడా రిజిస్టర్ కావడం లేదు.

ఓవైపు పాటలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసి కూడా, మేకర్స్ లిరికల్ వీడియోస్ విడుదల చేయడం ఆపడం లేదు. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశాడు. డు..డు.. అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను హీరోయిజం ఎలివేషన్స్ కోసం వాడారు. ఈ పాట కూడా అంతంతమాత్రంగానే ఉంది.

లిరికల్ వీడియోలో రవితేజ ఎప్పీయరెన్స్, ఆయన సిగ్నేచర్ స్టెప్ బాగున్నాయి తప్ప, పాట మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చివరికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా అరకొరగానే ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానపర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకుడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు.



First Published:  26 Nov 2022 10:11 AM GMT
Next Story