Telugu Global
Cinema & Entertainment

ఆ దర్శకుడితో రవితేజ సంప్రదింపులు?

గతంలో రవితేజ-సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆ దర్శకుడితో రవితేజ సంప్రదింపులు?
X

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం రవితేజ స్టయిల్. చేతిలో కనీసం 3 సినిమాలు లేనిదే ఈ హీరోకు నిద్ర పట్టదు. ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్న ఈ నటుడు, త్వరలోనే చేయబోయే మరో 3 సినిమాలకు సంబంధించి ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఓ దర్శకుడి పేరు తెరపైకొచ్చింది. అతడే సంపత్ నంది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రవితేజ-సంపత్ నంది కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది. కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హీరో-డైరక్టర్ మధ్య చర్చలు సాగుతున్నట్టు సమాచారం.

వీళ్లది ఫ్రెష్ కాంబినేషన్ కాదు. ఇంతకుముందు సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ సినిమాలో నటించాడు రవితేజ. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలవబోతున్నారు. ఈసారి రవితేజతో థ్రిల్లర్ జానర్ లో ఓ ప్రయోగం చేయబోతున్నాడట ఈ దర్శకుడు.




First Published:  12 Sep 2022 3:55 AM GMT
Next Story