Telugu Global
Cinema & Entertainment

Raviteja | మరో కొత్త పాత్రలో మాస్ రాజా

Raviteja - టైగర్ నాగేశ్వరరావు తర్వాత మరో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా స్టార్ట్ అయింది.

Raviteja | మరో కొత్త పాత్రలో మాస్ రాజా
X

ఈ మధ్య కొత్తకొత్త కథలు సెలక్ట్ చేసుకుంటున్నాడు రవితేజ. గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చేశాడు. ప్రస్తుతం ఈగిల్ అనే మరో డిఫరెంట్ సబ్జెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇంకో కొత్త కథను ఎంచుకున్నారు. ఒకప్పుడు కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేసిన మాస్ రాజా.. ఇప్పుడు నటుడిగా తననుతాను నిరూపించుకునే కథల వైపు మొగ్గుచూపుతున్నాడు.

మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని నాలుగోసారి కలిశారు. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో, రవితేజ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు. నటుడిగా మారిన దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇది ఆయన చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా. ఇంధూజ రవిచంద్రన్ ని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియజేస్తారు. తాజాగా ఈ సినిమా లాంఛ్ అయింది.

వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది ఈ సినిమా. పవర్ ఫుల్ కథతో వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. రవితేజతో తమన్‌కి ఇది 12వ చిత్రం కావడం విశేషం. ఇక గోపీచంద్ మలినేనితో తమన్ కు ఇది 7వ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ లో తమన్ కు ఇది 4వ చిత్రం.

బిగిల్, మెర్సల్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు.. రవితేజ కొత్త సినిమాకు కెమెరామెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ కాగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

First Published:  27 Oct 2023 5:36 PM GMT
Next Story