Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమా సెట్స్ పైకొచ్చిన రవితేజ

బాబి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్స్ పైకి రవితేజ కూడా వచ్చాడు.

చిరంజీవి సినిమా సెట్స్ పైకొచ్చిన రవితేజ
X

చిరంజీవి సినిమాలోకి రవితేజ వస్తాడా రాడా? ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. చిరంజీవి-బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోకి రవితేజ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో రవితేజ జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్రంలో అతను పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పోలీస్ యూనిఫాంలో రవితేజ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 2 నెలల్లో రవితేజకు సంబంధించిన పోర్షన్ మొత్తం పూర్తి చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత రవితేజ తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు.

ఈ సినిమాలో చేసేది కీలక పాత్రే అయినప్పటికీ, పారితోషికం విషయంలో మాత్రం రవితేజ కాంప్రమైజ్ అవ్వలేదు. రెమ్యూనరేషన్ దగ్గర రేటు తెగక ఇన్నాళ్లూ సందిగ్దత నెలకొంది. మాస్ రాజా అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించడంతో చిరంజీవి-రవితేజ కాంబో లాక్ అయింది.

హీరోగా నటించడానికి రవితేజ ఎంత తీసుకుంటాడో, అంతకంటే కాస్త తక్కువ ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు "వాల్తేరు వీరయ్య" అనే టైటిల్ అనుకుంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.



First Published:  16 July 2022 11:24 AM GMT
Next Story