Telugu Global
Cinema & Entertainment

Raviteja - మరోసారి గోపీచంద్ మలినేనితో..!

Raviteja Gopichand Malineni - వీళ్లిద్దరూ మరోసారి చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పై సినిమా చేయబోతున్నారు.

Raviteja - మరోసారి గోపీచంద్ మలినేనితో..!
X

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. క్రాక్ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈసారి కూడా నిర్మాతగా వ్యవహరించబోతోంది.

గోపీచంద్ మలినేనిని దర్శకుడిగా మార్చిందే రవితేజ. డాన్ శీను అనే సినిమాకో మలినేని దర్శకుడిగా మారాడు. ఆ కృతజ్ఞత అతడికి ఎప్పుడూ ఉంది. అంతేకాదు, డాన్ శీను తర్వాత బలుపు అనే సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత క్రాక్ అనే సినిమా చేశాడు.

ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్టయింది. రవితేజ బాడీ లాంగ్వేజ్ ను, కామెడీ టైమింగ్ ను పెర్ ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటాడనే పేరుంది గోపీచంద్ మలినేనికి. సో.. ఈసారి వీళ్లిద్దరి నుంచి మరో హిట్ సినిమా ఆశించొచ్చు.

ఈరోజు లేదా రేపు ఈ సినిమా ప్రకటన రాబోతోంది. సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ఈ ప్రాజెక్టులోకి కూడా శృతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు గోపీచంద్ మలినేని. ఇంతకుముందు ఇతడు తీసిన బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల్లో శృతిహాసన్ నటించింది.

First Published:  8 July 2023 4:37 AM GMT
Next Story