Telugu Global
Cinema & Entertainment

Ravi Teja: పండగ చేసుకొని రెండేళ్లయింది

Raviteja: రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. రవితేజ ఎట్టకేలకు ఓ హిట్ కొట్టాడు.

Ravi Teja: పండగ చేసుకొని రెండేళ్లయింది
X

చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రావడంతో రవితేజ పండగ చేసుకుంటున్నాడు. అప్పుడెప్పుడో సంక్రాంతి టైమ్ లో క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. మళ్లీ ఇన్నాళ్లకు మళ్లీ సంక్రాంతి టైమ్ లోనే మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ రెండు విజయాల మధ్య గ్యాప్ రెండేళ్లు. అందుకే పండగ చేసుకొని రెండేళ్లయిందంటూ స్పందించాడు మాస్ రాజా.


"ధమాకాలో పనిచేసిన టెక్నిషియన్స్ అందరికీ కంగ్రాట్స్. ధమాకా సినిమాకి డ్రైవర్ దర్శకుడు త్రినాథరావు, నేను కండక్టర్ ని(నవ్వుతూ). త్రినాథరావు, ప్రసన్న కాంబో ఎప్పుడూ హిట్టే. సెకెండ్ హ్యాట్రిక్ లోకి ఎంటర్ అయ్యారు. అదీ కొట్టేయాలి. అందరినీ ఇలానే ఎంటర్ టైన్ చేయాలి. ధమాకాకి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పండగ. ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగమీద పండగ చేసుకోవాలి. మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలి."


ఇలా ధమాకా సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నాడు రవితేజ. రెండేళ్ల కిందట క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు ఈ హీరో. ఆ సక్సెస్ తో వెంటనే తన రెమ్యూనరేషన్ పెంచేశాడు. ఆ తర్వాత వరుసపెట్టి ఫ్లాపులిచ్చాడు. ఇప్పుడు మళ్లీ రెండేళ్లకు ధమాకాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ హిట్ తో ఆయన మరోసారి రేటు పెంచుతాడేమో చూడాలి.

First Published:  30 Dec 2022 7:11 AM GMT
Next Story