Telugu Global
Cinema & Entertainment

చిన్న దర్శకుడికి పెద్ద పెద్ద ఆఫర్లు

చిన్న సినిమాలు చేశాడు.. ఇప్పుడు పెద్ద సినిమాల స్థాయికి ఎదిగాడు రవికిరణ్ కోలా.

చిన్న దర్శకుడికి పెద్ద పెద్ద ఆఫర్లు
X

రవికిరణ్ కోలా.. ఈ దర్శకుడి పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టడం కష్టం. కానీ రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. అలా తన తొలి సినిమాతోనే టాలీవుడ్ ను ఆకర్షించాడు ఈ దర్శకుడు. ఆ తర్వాత అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాకు కథ-మాటలు-స్క్రీన్ ప్లే అందించి షో రన్నర్ గా నిలిచాడు.

ఇలా 2 సినిమాల విజయాలతో ఈ దర్శకుడు, టాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయ్యాడు. చాలామంది నిర్మాతలు ఇతడితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటున్నాడు ఈ దర్శకుడు.

"పెద్ద యాక్షన్ ప్యాక్డ్ సినిమా అందించాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న కథను మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలకు వినిపించాను. ప్రస్తుతం ఆ సినిమా వర్క్ జరుగుతోంది. దీంతోపాటు ఎస్‌వీసీసీ బ్యానర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఇంకో సినిమా ఉంటుంది. అలాగే ఓ అడ్వెంచర్స్ డ్రామా కథ కూడా రెడీగా ఉంది. మరో పెద్ద బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. వాటిని త్వరలోనే వెల్లడిస్తాను."

ఇలా వరుసపెట్టి ఆఫర్లతో దూసుకుపోతున్నాడు ఈ దర్శకుడు. సెన్సిబుల్ చిత్రాలు తీయగలడనే పేరున్న రవికిరణ్ కోలా.. త్వరలోనే మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తానంటున్నాడు.

First Published:  22 July 2022 3:30 AM GMT
Next Story