Telugu Global
Cinema & Entertainment

Ravi Teja: రవితేజ "ధమాకా" సినిమా పై ఏ మాత్రం పెరగని బజ్

Ravi Teja's Dhamaka Movie: తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "ధమాకా" పైన పెట్టుకున్నారు రవితేజ.

Dhamaka Movie Box Office Collections
X

Dhamaka Box Office: మొదటి రోజు వసూళ్లు

మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఒకటి అరా హిట్లు వస్తున్నప్పటికీ రవితేజ ఫామ్ లో మాత్రం లేరని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు కానీ ఆ తర్వాత విడుదల అయిన "ఖిలాడి", "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యారు.

తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "ధమాకా" పైన పెట్టుకున్నారు రవితేజ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఐదు పాటలు మరియు సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ క్యాష్ ప్రోగ్రామ్ కి కూడా వెళ్లారు. విడుదల కి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది కానీ ఇప్పటికీ కూడా సినిమాపై అనుకున్న స్థాయిలో బజ్ మాత్రం రావటం లేదు.

సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు బాగానే ఉన్నప్పటికీ టీజర్ లో మాత్రం పెద్దగా సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్లు ఉన్నట్టు అనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైం కేవలం 130 నిమిషాలు అని సమాచారం. మరోవైపు రవితేజ ఇంకా తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది.

అయితే ఈ సినిమాతో పాటే నిఖిల్ "18 పేజెస్" కూడా విడుదల కాబోతోంది. గతంలో "ఖిలాడి" టైంలో "డిజె టిల్లు" డామినేట్ చేసినట్లు "ధమాకా" ని కూడా "18 పేజెస్" డామినేట్ చేస్తుందేమోనని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక డిసెంబర్ 15న ఈ సినిమా ట్రైలర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేయబోతున్నారు. మరి ట్రైలర్ తో అయినా సినిమాపై బజ్ పెరుగుతుందో లేదో వేచి చూడాలి. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయరామ్, సచిన్ కేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, అలీ, పవిత్ర లోకేష్, హైపర్ ఆది తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  14 Dec 2022 6:25 AM GMT
Next Story