Telugu Global
Cinema & Entertainment

రవితేజ రిటర్న్స్: ధమాకాకు మూడు రోజుల్లో రూ. 32 కోట్ల వసూళ్లు

Dhamaka Movie Box Office Collection: మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లో రూ. 32 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు వసూళ్ల కంటే ఈ మూవీకి మూడో రోజు వసూళ్లు అధికంగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రవితేజ రిటర్న్స్: ధమాకాకు మూడు రోజుల్లో రూ. 32 కోట్ల వసూళ్లు
X

ఇక అతడి పని అయిపోయిందని విమర్శలు వచ్చిన ప్రతిసారి గట్టిగా సమాధానం ఇస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. రవితేజకు కొన్నేళ్లుగా సరైన విజయాలు లేవు. ఆ మధ్య రాజా ది గ్రేట్ వంటి హిట్ సినిమా వచ్చినప్పటికీ అది రవితేజ స్థాయి హిట్ కాదు. ఆ తర్వాత కూడా మళ్లీ వరుస పరాజయాలే రవితేజను పలకరించాయి. అప్పుడు వచ్చింది క్రాక్ మూవీ. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇక రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాడు అని అనుకునేలోగానే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు భారీ పరాజయాలుగా మిగిలాయి. రెండు ప్లాపుల తర్వాత మళ్లీ రవితేజ ధమాకా సినిమాతో గ్రాండ్ హిట్ అందుకొని తన పని ఇంకా అయిపోలేదని విమర్శకులకు చెక్ పెట్టాడు.

డిసెంబర్ 23వ తేదీన ధమాకా సినిమా విడుదల కాగా..తొలి రోజు మిక్డ్స్‌ టాక్ వచ్చింది. అయితే టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లో రూ. 32 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు వసూళ్ల కంటే ఈ మూవీకి మూడో రోజు వసూళ్లు అధికంగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం కూడా ధమాకా మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

తనకు హిట్ పడితే వసూళ్లు ఎలా ఉంటాయో రవితేజ మరోసారి చాటి చెప్పాడు. కాగా, ధమాకా సినిమాకు త్రినాథ‌రావు నక్కిన దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల రవితేజకు జోడిగా నటించింది. ఇక రవితేజ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. క్రిస్మస్‌కు హిట్ కొట్టిన రవితేజ సంక్రాంతి పండక్కి మరో హిట్ కొడతాడేమో చూడాలి.

First Published:  27 Dec 2022 6:20 AM GMT
Next Story