Telugu Global
Cinema & Entertainment

Rasha Thadani | చరణ్ సరసన హీరోయిన్ కూతురు?

Rasha Thadani - రవీనా టాండన్ కూతురు రాషా తడానీ, రామ్ చరణ్ సరసన నటించే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ మీకోసం..

Rasha Thadani | చరణ్ సరసన హీరోయిన్ కూతురు?
X

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను చాలా కాలం కిందటే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్ లో ఉంది.

ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌పైకి తీసుకురావడానికి మేకర్స్ ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ క్రమంలో నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రవీనా టాండన్ కుమార్తె, రాషా తడానీని, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ముంబై ఫిల్మ్ సర్కిల్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాషా తడానీ. ఫొటోషూట్స్ తో ఈమె ఇప్పుడిప్పుడే హాట్ అవుతోంది. ఇలాంటి ముద్దుగుమ్మను చరణ్ సినిమాలోకి తీసుకుంటే, బాగుంటుందని భావిస్తున్నారు. రీసెంట్ గా ఫొటోషూట్ కూడా పూర్తిచేశారు. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

రాషా తండ్రి, అనిల్ తడాని ఒక ప్రసిద్ధ పంపిణీదారు. హిందీలో పలు తెలుగు చిత్రాలను విడుదల చేశారు. బుచ్చిబాబు ఉప్పెనతో కృతి శెట్టిని లాంచ్ చేశాడు. ఆమె సూపర్ హిట్ హీరోయిన్ అయింది. ఇప్పుడు రాషాపై కన్నేశాడు ఈ దర్శకుడు.

First Published:  1 Oct 2023 3:39 PM GMT
Next Story