Telugu Global
Cinema & Entertainment

Ravanasura - రావణాసుర థియేట్రికల్ ట్రయిలర్ విడుదల

Ravanasura trailer review - రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం రావణాసుర. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది

Ravanasura - రావణాసుర థియేట్రికల్ ట్రయిలర్ విడుదల
X

రవితేజ నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే రిలీజైంది. తాజాగా మేకర్స్ రావణాసుర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.


రావణాసుర టీజర్‌ లో సినిమాలోని యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చూపించారు. ట్రైలర్ లో కోర్ పాయింట్ గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, ఇతర అంశాలను ప్రజంట్ చేశారు. ఇది మర్డర్ మిస్టరీగా ప్రారంభమవుతుంది. సంపత్ రాజ్ తాను నిర్దోషినని చెబుతాడు. క్రిమినల్ లాయర్ అయిన రవితేజ తన సీనియర్ ఫారియా అబ్దుల్లాను కేసును టేకప్ చేయాల్సిందిగా కోరుతాడు. కానీ ఆమె ఇంట్రెస్ట్ చూపించదు. అప్పుడు, రవితేజ పాత్రలోని ఇతర షేడ్స్‌ కనిపిస్తాయి. పోలీసు ఆఫీసర్, రాజకీయ నాయకుడు అతన్ని క్రిమినల్ అని పిలుస్తుండగా, అతను కూడా చివరికి అదే ఒప్పుకుంటాడు.


సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో చూపించేలా ట్రైల‌ర్‌ని నీట్ గా కట్ చేశారు. అయితే, సినిమా కోర్ పాయింట్ ఏంటనేది చూపించకుండా క్యురియాసిటీ పెంచారు. దర్శకుడు సుధీర్ వర్మ తన టేకింగ్‌ తో కట్టిపడేశాడు.


రవితేజను చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేశాడు. పాత్ర యొక్క డార్క్ షేడ్స్ ని చూపే చివరి షాట్ ఎక్స్ టార్డీనరీగా ఉంది. జోకర్ పోస్టర్ యాటిట్యూడ్, ఈవిల్ స్మైల్ చూడటానికి ఒక ట్రీట్‌లా ఉంది.


హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం బాగుంది. హర్షవర్ధన్‌తో కలిసి, భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు పాటలు అందించాడు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది రావణాసుర చిత్రం.



First Published:  29 March 2023 2:04 PM GMT
Next Story