Telugu Global
Cinema & Entertainment

జోరుగా రవితేజ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ స్టార్ట్ అయింది

Ravanasura Movie Review: రావణాసుర మూవీ రివ్యూ {2/5}
X

Ravanasura Movie Review: రావణాసుర మూవీ రివ్యూ {2/5}

ఈ కాలం ఓ క్రేజ్ ఉన్న సినిమా వస్తుందంటే చాలు, థియేట్రికల్ కంటే నాన్-థియేట్రికల్ బిజినెస్ ముందుగా క్లోజ్ అవుతుంది. రవితేజ లాంటి మాస్ హీరో సినిమాకైతే ఈ బిజినెస్ ఇంకా ముందే క్లోజ్ అవుతుంది. ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన రవితేజ, ఈ మూవీతో పాటు రావణాసుర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా ఫాస్ట్ గా క్లోజ్ అవుతోంది.

రావణాసుర సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్, ఆహాకు సంయుక్తంగా ఇచ్చేందుకు చర్చలు సాగుతున్నాయి. మరోవైపు రావణాసుర హిందీ డబ్బింగ్ రైట్స్ ఆల్రెడీ అమ్ముడుపోయాయి. ఇలా రవితేజ కొత్త సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రావణాసుర సినిమా. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఓ కీలక పాత్రలో సుశాంత్ నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు.

ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతోన్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదుగురిలో ప్రతీ ఒక్క పాత్రకు ప్రాముఖ్యత ఉండ‌నుంది. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథను అందించాడు.

First Published:  15 July 2022 10:59 AM GMT
Next Story