Telugu Global
Cinema & Entertainment

Ravanasura - రెండో రోజుకే అట్టర్ ఫ్లాప్

Ravanasura becomes flop - రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా రెండో రోజుకే ఫ్లాప్ అనిపించుకుంది.

Ravanasura - రెండో రోజుకే అట్టర్ ఫ్లాప్
X

రవితేజ హీరో కమ్ విలన్ గా నటించిన సినిమా రావణాసుర. విడుదలైన మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండో రోజుకు దాదాపు దుకాణం సర్దేసినట్టయింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు హైప్ కారణంగా ఓపెనింగ్స్ బాగున్నాయి. కానీ నెగెటివ్ టాక్, రివ్యూస్ కారణంగా శనివారానికి సినిమా పూర్తిగా పడిపోయింది.

విడుదలైన ఈ 2 రోజుల్లో రావణాసుర సినిమాకు అటుఇటుగా 7 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టయింది. సోమవారం నుంచి ఈ సినిమా కోలుకోవడం దాదాపు అసాధ్యమనే విషయం తేలిపోయింది. అలా రవితేజ ఫ్లాపులకు రావణాసుర బ్రేకులేసింది.

రీసెంట్ గా వరుస హిట్స్ ఇచ్చాడు మాస్ రాజా. అతడు నటించిన ధమాకా సినిమా పెద్ద హిట్టయింది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా పెద్ద హిట్టయింది. సంక్రాంతి విజేతగా నిలిచింది.

అదే ఊపులో రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ కొడదామని చూసిన రవితేజకు నిరాశ తప్పలేదు. రొటీన్ కథ, స్క్రీన్ ప్లేలో లోపాల వల్ల ఈ సినిమా ఫెయిలైంది.

First Published:  9 April 2023 1:29 PM GMT
Next Story