Telugu Global
Cinema & Entertainment

Rainbow Movie | రష్మిక మూవీ షూటింగ్ అప్ డేట్స్

Rashmika's Rainbow Movie - ఓవైపు పుష్ప-2 సినిమా చేస్తున్న రష్మిక, మరోవైపు సైలెంట్ గా రెయిన్ బో అనే సినిమాను కూడా పూర్తిచేస్తోంది.

Rainbow Movie | రష్మిక మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

రష్మిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ 'రెయిన్‌బో. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు 'రెయిన్‌బో' సెకండ్ షెడ్యూల్ కి యూనిట్ సిద్ధమౌతోంది. ఈ నెలలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.

జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ బంగ్లాన్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాడు. కెరీర్ లో రష్మిక చేస్తున్న తొలి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ఇది.

కెరీర్ లో బిజీగా ఉంటున్న టైమ్ లో రష్మిక వద్దకు వచ్చిన కథ ఇది. ఈ లైన్ ఆమెకు చాలా బాగా నచ్చింది. అందుకే బిజీ షెడ్యూల్ లో కూడా రెయిన్ బో సినిమాకు ఓకే చెప్పింది. ఓవైపు పుష్ప-2 షూటింగ్ నడుస్తున్నప్పటికీ, రెయిన్ బో మూవీకి కాల్షీట్లు కేటాయించింది.

First Published:  16 July 2023 3:16 PM GMT
Next Story