Telugu Global
Cinema & Entertainment

Mission Majnu: డైరక్ట్ గా ఓటీటీలోకి రష్మిక సినిమా

Mission Majnu: రష్మిక ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను. ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు.

Mission Majnu: డైరక్ట్ గా ఓటీటీలోకి రష్మిక సినిమా
X

బాలీవుడ్ లో ఓ వెలుగు వెలగాలని ఆశపడిన రష్మిక ఆశలపై నీళ్లుచల్లింది మిషన్ మజ్ను సినిమా. ఆమె బాలీవుడ్ లో ముందుగా సైన్ చేసిన సినిమా ఇదే. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా ఎప్పటికప్పుడు లేట్ అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఇక్కడ రష్మికకు నిరాశ తప్పలేదు.

ఎందుకుంటే, మిషన్ మజ్ను సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈనెల 20న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను నేరుగా స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. థియేటర్లలో రిలీజ్ అయితే ఆ క్రేజ్ వేరు. ఇలా నేరుగా ఓటీటీలోకి రావడంతో, రష్మిక తను ఆశించిన క్రేజ్ ను అందుకోలేకపోతోంది.

సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా నటించిన ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్. 1970ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దార్థ్, ఓ రా ఏజెంట్ గా నటించాడు. ఇందులో రష్మికకు కూడా యాక్షన్ పార్ట్ ఉందనే టాక్ నడుస్తోంది.

మొదట ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి నిర్ణయించారు. కానీ అప్పట్నుంచి వివిధ కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది. తాజాగా బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ మరోసారి ఊపందుకోవడంతో, నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.




First Published:  14 Dec 2022 7:30 AM GMT
Next Story