Telugu Global
Cinema & Entertainment

Rashmika - మరో పెద్ద బాలీవుడ్ సినిమాలో రష్మిక

Rashmika Bollywood - బాలీవుడ్ లో పాగా వేసిన రష్మిక, తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పింది. త్వరలోనే ఆమె షాహిద్ కపూర్ సరసన కనిపించనుంది.

Rashmika - మరో పెద్ద బాలీవుడ్ సినిమాలో రష్మిక
X

యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హిందీ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతోంది. అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్రా నల మిషన్ మజ్నులో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది. త్వరలోనే షాహిద్ కపూర్ సరసన రష్మిక నటించనుంది. అనీస్ బజ్మీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. షాహిద్ కపూర్ హీరోగా రాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు, బాలాజీ టెలిఫిలిమ్స్ కు చెందిన ఏక్తా కపూర్ తో కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు రాజు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప-2 సినిమాలో నటిస్తోంది రష్మిక. అటు రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటిస్తోంది. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఓ హిస్టారికల్ మూవీలో కూడా నటిస్తోంది. వీటితో పాటు, ఇప్పుడు షాహిద్ కపూర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. ఇదొక యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావస్తోంది. త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయి. రెగ్యులర్ షూట్ ఆగస్టులో ప్రారంభమౌతుంది. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు, వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది రష్మిక. అటు రెయిన్‌బో అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ కూడా సెట్స్ పై ఉంది.

First Published:  13 May 2023 7:55 AM GMT
Next Story