Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ రోల్స్ తో పాటు ప్రత్యేక పాత్రలు కూడా..

సీతారామంలో రష్మిక చేసిన అఫ్రిన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ప్రత్యేక పాత్రలు దొరికితే చేస్తానంటోంది ఈ బ్యూటీ.

హీరోయిన్ రోల్స్ తో పాటు ప్రత్యేక పాత్రలు కూడా..
X

ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక. తెలుగులో ఆమె కాల్షీట్ల కోసం మేకర్స్ వెయిటింగ్. అటు హిందీలో 3 సినిమాలు చేస్తోంది. తమిళ్ లో కూడా కొనసాగుతోంది. ఇలాంటి టైమ్ లో ఏ హీరోయిన్ అయినా ప్రత్యేక పాత్రలు చేస్తుందా? తను మాత్రం చేస్తానంటోంది. సీతారామం సినిమాలో తను పోషించిన అఫ్రిన్ లాంటి క్యారెక్టర్ దొరికితే ప్రత్యేక పాత్రల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

"సీతారామం నాకు కచ్చితంగా డిఫరెంట్ మూవీ. నేను ఇప్పటివరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంటుంది. సీతారామంలో నా పాత్ర చాలా యునిక్ గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాంటి ప్రత్యేక పాత్రలు చేస్తా."

ఇలా హీరోయిన్ గా కొనసాగుతూనే ప్రత్యేక పాత్రలు చేస్తానంటోంది రష్మిక. ప్రయోగాత్మక చిత్రాలు చేయడం తనకు ఇష్టమని, నటిగా కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడే ప్రయోగాలు చేస్తే బాగుంటుందని తెలిపింది. అందుకే తన కంఫర్ట్ జోన్ దాటి సినిమాలు చేస్తున్నానని తెలిపింది రష్మిక.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు-తమిళ భాషల్లో విజయ్ సరసన వారసుడు సినిమా చేస్తోంది. పుష్ప-2 సినిమా కోసం వెయిటింగ్.

First Published:  9 Aug 2022 5:04 AM GMT
Next Story