Telugu Global
Cinema & Entertainment

రష్మికకు ముంబయిలో సొంత ఫ్లాట్?

సౌత్ హీరోయిన్ రష్మిక, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ అవుతోంది. అందుకే ఆమె ముంబయిలో సొంత ఫ్లాట్ కొనుక్కునే ఆలోచనలు చేస్తోంది.

Rashmika Mandanna
X

బాలీవుడ్ లో అడుగుపెడితే చాలు, ఓ కోరిక అలా మనసులో మెదులుతుంది. అదే ముంబయిలో ఫ్లాట్. హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ముంబయిలోని ఓ ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ కొనుక్కోవాలని ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. తమన్న లాంటి హీరోయిన్లు బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికీ ముంబయిలో ఫ్లాట్ సొంతం చేసుకోలేకపోయారు. ఎంతో ప్రయత్నించి, లాక్ డౌన్ టైమ్ లో శృతిహాసన్ ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది రష్మిక. దీంతో పాటు కొన్ని యాడ్స్ కు కూడా సైన్ చేసింది. మరికొన్ని స్టార్టప్ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు కూడా పెట్టింది. ఇవన్నీ ముంబయి కేంద్రంగానే జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ స్టార్ హోటల్స్ లో ఉంటూ అవన్నీ మెయింటైన్ చేస్తూ వస్తున్న రష్మిక.. ఇప్పుడు ఫ్లాట్ కొనే ఆలోచనలో ఉంది.

వీలైతే బాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగా ఉండే బాంద్రా ఏరియాలో ఓ ఫ్లాట్ కొనుక్కోవాలని రష్మిక ఆలోచిస్తోంది. అయితే ముంబయిలో లగ్జరీ ఫ్లాట్ అంటే మామూలు విషయం కాదు. కోట్లు కుమ్మరించాల్సి ఉంటుంది. అందుకే రష్మిక ఆలోచనలో పడింది. కనీసం మరో నాలుగేళ్ల బాలీవుడ్ కెరీర్ ఉంటే, ముంబయిలో ఫ్లాట్ కొనాలనేది రష్మిక ప్లాన్.

రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లోనే 32 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. కేవలం ఒక సంవత్సరంలోనే, ఆమె 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించింది. పుష్ప సినిమా బాలీవుడ్ లో హిట్టవ్వడం ఆమెకు పెద్ద బోనస్ గా మారింది.

రష్మిక చేతిలో 3 బాలీవుడ్ సినిమాలున్నాయి. రాబోయే 2 నెలల్లో ఆమె రెండు హిందీ ప్రాజెక్ట్‌లు రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్ పై ఆమె చాలా బిగ్ ప్లానింగ్ లో ఉంది.

First Published:  11 Aug 2022 10:24 AM GMT
Next Story