Telugu Global
Cinema & Entertainment

Rashmika | మరో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక

Rashmika Shahrukh Khan - షారూక్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. అయితే సినిమాలో మాత్రం కాదు.

Rashmika | మరో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక
X

కొన్నాళ్లుగా రష్మిక బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో బంపరాఫర్ అందుకుంది. త్వరలోనే ఆమె షారూక్ సరసన నటించనుంది.

అయితే ఇది సినిమా కాదు. ఓ యాడ్ మాత్రమే. ఓ యాడ్ షూటింగ్ లో షారూక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది రష్మిక. అయితే యాడ్ లో నటిస్తే ఆటోమేటిగ్గా సినిమా ఛాన్స్ దక్కినట్టే. దీని వెనక ఓ రీజన్ ఉంది.

గతంలో షారూక్ తో యాడ్స్ చేసిన హీరోయిన్లంతా, ఆ తర్వాత అతడి సరసన సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. సో.. రష్మిక కూడా త్వరలోనే షారూక్ సరసన హీరోయిన్ గా నటించడం గ్యారెంటీ అంటున్నారు. ఈ నెలాఖరులోనే షారూక్-రష్మిక కొత్త యాడ్ షూటింగ్ ఉంటుంది.

షారూక్ కూడా సౌత్ హీరోయిన్లకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న జవాన్ సినిమాలో షారూక్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కాబట్టి, కింగ్ ఖాన్ సినిమాలో అవకాశం అందుకోవడానికి ఒక్క మెట్టు దూరంలో నిలిచింది రష్మిక.

గతంలో షారూక్ సరసన నటించిన దీపిక, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు గా ఎదిగారు. రష్మిక కూడా అదే విధంగా స్టార్ అయిపోతుందని అంచనా వేస్తోంది బాలీవుడ్.

First Published:  5 Aug 2023 8:56 AM GMT
Next Story