Telugu Global
Cinema & Entertainment

Raviteja | రవితేజ-రష్మిక కాంబినేషన్ సెట్

Rashmika Raviteja - మరో ఫ్రెష్ కాంబినేషన్ సెట్ అయింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారు రవితేజ-రష్మిక

Raviteja | రవితేజ-రష్మిక కాంబినేషన్ సెట్
X

మాస్ మహారాజా రవితేజ నిత్యం సినిమాలతో బిజీగా ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నాడు. మరోవైపు ఈగిల్ కూడా తెరకెక్కుతోంది. ఈ రెండు మూవీస్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏదో ఒకటి పూర్తయిన వెంటనే మరో సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు రవితేజ.

త్వరలోనే గోపీచంద్ మలినేనితో ఒక మాస్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శ్రీను, బలుపు, క్రాక్ సినిమాలు మూడూ పెద్ద హిట్టయ్యాయి. దీంతో వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా కూడా సూపర్ హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు.

నిజానికి ఈ ప్రాజెక్టులో ముందుగా శ్రీలీలను అనుకున్నారు. ఆమెను తీసుకుంటే 'ధమాకా' సెంటిమెంట్ కలిసొస్తుందని భావించారు. కానీ శ్రీలీల కాల్షీట్లు సెట్ చేయలేకపోయింది. ఇక పూజాహెగ్డే అందుబాటులోకి వచ్చింది. ఎన్ని కాల్షీట్లు కావాలంటే అన్ని ఇవ్వడానికి రెడీ అయింది. కానీ ఆమె ట్రాక్ రికార్డ్ బాగాలేదు.

దీంతో అన్నీ ఆలోచించి రష్మిక అయితే బెటర్ అని లాక్ చేశారు. పైగా ఇప్పుడు రష్మిక, మైత్రీ బ్యానర్ లోనే పుష్ప-2 చేస్తోంది. అదే బ్యానర్ లో ఆమె అలా కొనసాగనుంది.

First Published:  21 Sept 2023 12:04 PM GMT
Next Story