Telugu Global
Cinema & Entertainment

Rashmika - మరో రికార్డ్ సృష్టించిన రష్మిక

Rashmika - రష్మిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో స్థానం సంపాదించింది.

Rashmika - మరో రికార్డ్ సృష్టించిన రష్మిక
X

నేషనల్ క్రష్ రష్మిక మరోసారి జాతీయ స్థాయిలో అందర్నీ ఆకర్షించింది. ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో రష్మిక మూడో స్థానంలో నిలిచింది. చాలామంది స్టార్స్ ను వెనక్క నెట్టింది. ఇంతకీ ఆ వారంలో రష్మికకు ఎందుకింత పాపులారిటీ వచ్చింది?

ఈ నెల ప్రారంభంలో రష్మిక తన పుట్టినరోజును జరుపుకుంది, ఆ తర్వాత పుష్ప 2 టీజర్‌ను విడుదలైంది. ఈ రెండు అంశాలు రష్మికను సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టాయి. దీంతో ఆమె ఆటోమేటిగ్గా పాపులర్ ఫీచర్స్ లిస్ట్ లోకి ఎంటరైంది.

రష్మిక ఇలా టాప్ చార్టుల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. ఇండియాలో నిర్వహించిన ఎన్నో సర్వేల్లో ఆమె టాప్-10 లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఒక దశలో ఆమె నేషనల్ క్రష్ గా అవతరించింది. ఆ పాపులారిటీనే రష్మికకు వరుసగా అవకాశాలు తెచ్చిపెడుతోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ, బాలీవుడ్ లో రణబీర్ సరసన యానిమల్ అనే సినిమా చేస్తోంది. ఇక తెలుగులో బన్నీతో పుష్ప-2 సెట్స్ లో ఉంది. రీసెంట్ గా రెయిన్ బో అనే సినిమా లాంఛ్ చేసింది. వీటితో పాటు నితిన్ తో ఓ సినిమా చేయబోతోంది.

First Published:  17 April 2023 2:30 AM GMT
Next Story