Telugu Global
Cinema & Entertainment

Rashmika | విజయ్ దేవరకొండ సినిమాలో రష్మిక

Rashmika - విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఇందులో రష్మిక కూడా ఉంది. తాజాగా వీడియో కూడా లీక్ అయింది.

Rashmika | విజయ్ దేవరకొండ సినిమాలో రష్మిక
X

ఫ్యామిలీ స్టార్ నుండి రష్మిక అతిధి పాత్ర పోషించిన లుక్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఫ్యామిలీ స్టార్, పరశురామ్ దర్శకత్వంలో వస్తోంది. గీతగోవిందం తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమా రిపీట్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక కూడా ఉందనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇప్పుడదే నిజమైంది.

విజయ్ దేవరకొండ, రష్మిక, పరశురామ్ కాంబోలో గీత గోవిందం వచ్చి, పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ స్టార్ లో మాత్రం రష్మికను రిపీట్ చేయలేదు. ఇందులో ఆమె అతిథి పాత్ర పోషించిందనే పుకారు చాన్నాళ్లుగా ఉంది. ఈ పుకార్లను నిజం చేస్తూ, రష్మిక ఈమధ్యే సెట్స్ పైకి వచ్చింది. ఆమెపై కొన్ని షాట్స్ తీశారు. ఆ టైమ్ లో ఎవరో వీడియో తీశారు. ఇప్పుడది ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది.

ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి ఢిల్లీలో ఓ వెడ్డింగ్ సాంగ్ తీశారు. ఆ పాటతోనే రష్మిక ఎంట్రీ ఇస్తుందట. ఆ క్లిప్ ను ఇప్పుడు కొంతమంది లీక్ చేశారు. సీక్రెట్ గా ఉంచుదామనుకున్న అంశం ఇలా బయటపడింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే అది వాయిదా పడింది, వచ్చే ఏడాది వేసవిలో ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  30 Nov 2023 3:53 PM GMT
Next Story