Telugu Global
Cinema & Entertainment

Rashmika | శివకార్తికేయన్ సరసన రష్మిక

Rashmika - రష్మిక మరో సినిమాకు ఓకే చెప్పింది. శివకార్తికేయన్ సరసన నటించబోతోంది.

Rashmika | శివకార్తికేయన్ సరసన రష్మిక
X

పుష్ప, యానిమల్ సినిమాలతో నార్త్ లో మరింత పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక, కేవలం బాలీవుడ్ కే పరిమితమవ్వకుండా సౌత్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తమిళ్ లో శివకార్తికేయన్ సరసన నటించబోతోంది రష్మిక. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డాన్ (2022) దర్శకుడు సిబి చక్రవర్తి, డాన్ సహనటుడు ఎస్‌జె సూర్య, డాన్ హీరో శివకార్తికేయన్ మళ్లీ కలిశారు. కొత్త చిత్రం ప్రకటించారు. ఇందులో రష్మిక మందన్నను హీరోయిన్ గా తీసుకున్నారు.

స్టోరీ నచ్చడంతో, రష్మిక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఈ చిత్రానికి బాస్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. అటు రష్మిక, ఎస్ జే సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

పుష్ప-2, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ మూవీస్ తో పాటు బాలీవుడ్ సినిమాతో రష్మిక బిజీగా ఉండగా.. ఎస్ జే సూర్య ఏకంగా 6 సినిమాల్లో నటిస్తున్నాడు. వీళ్లంతా ఇప్పుడు తమ కొత్త సినిమా కోసం కలవబోతున్నారు.

First Published:  7 July 2024 9:02 AM GMT
Next Story