Telugu Global
Cinema & Entertainment

Rashmika Mandanna | విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న రష్మిక

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Rashmika Mandanna | విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న రష్మిక
X

హీరోయిన్ రష్మిక ఓ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆమె ఎక్కిన విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు ప్రకటించింది రష్మిక.

ప్రస్తుతం ముంబయిలో ఉంటోంది రష్మిక. పుష్ప-2 షూట్ లో పాల్గొనేందుకు ముంబయి నుంచి హైదరాబాద్ బయల్దేరింది. అదే విమానంలో మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉంది. ఇద్దరూ ఆనందంగా సెల్ఫీ కూడా దిగారు.

టేకాఫ్ అయిన 20 నిమిషాలకు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్ నుంచి శబ్దాలు రావడం, విమానం ఊగడం మొదలైంది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని తిరిగి ముంబయికి తీసుకొచ్చారు.

అలా ఓ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు వెల్లడించింది రష్మిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప-2తో పాటు, గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి.

First Published:  18 Feb 2024 1:53 PM GMT
Next Story