Telugu Global
Cinema & Entertainment

Rashmika | బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్

Rashmika - యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా మారింది రష్మిక. హిందీ నుంచి మరిన్ని బడా ఆఫర్లు అందుకునే స్థాయికి చేరింది.

Rashmika | బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్
X

రణబీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆ అంచనాల్ని అందుకోవడంలో సక్సెస్ అయింది. రిలీజైన 6 రోజులకే 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. కంప్లీట్ రన్ లో ఇది వెయ్యి కోట్ల క్లబ్ లో సులభంగా చేరుతుందనే అంచనాలున్నాయి.

ఇప్పుడీ సినిమా రష్మిక కెరీర్ కు మరింత బూస్టింగ్ ఇచ్చింది. యానిమల్ సక్సెస్ తో బాలీవుడ్ లో రష్మిక ఇప్పుడు పూర్తిస్థాయిలో కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగింది. నిజానికి యానిమల్ కంటే ముందే రష్మికకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చాయి. 2 సినిమాలు చేసింది కూడా. కానీ ఆ సినిమాలు ఆమె కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదు.

ఓ మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో యానిమల్ రూపంలో పెద్ద హిట్ అందుకుంది రష్మిక. కచ్చితంగా ఇది ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఆల్రెడీ ఆమె వద్దకు 3 భారీ సినిమాలు వచ్చాయి. ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

సౌత్ లో కూడా ఆమె బిజీగా ఉంది. పుష్ప-2 చేస్తోంది. రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాల షెడ్యూల్స్ చూసుకుంటూ, బాలీవుడ్ లో నటించాలి. ప్రస్తుతం ఆమె ఒకే ఒక్క బాలీవుడ్ సినిమాకు కాల్షీట్ కేటాయించగలదు. మరి ఆమె అంగీకరించబోయే ఆ పెద్ద సినిమా ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది.

First Published:  8 Dec 2023 4:10 PM GMT
Next Story