Telugu Global
Cinema & Entertainment

Beauty | రావు రమేష్ హీరోగా మరో సినిమా

Rao Ramesh's Beauty - రావు రమేష్ హీరోగా మరో సినిమా రాబోతోంది. దీనికి బ్యూటీ అనే టైటిల్ పెట్టారు.

Beauty | రావు రమేష్ హీరోగా మరో సినిమా
X

డైరెక్టర్ మారుతికి చెందిన టీమ్ ప్రోడక్ట్, వానరా సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మించబోతున్నాయి. ఇందులో రావు రమేష్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరోహీరోయిన్లుగా బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. దీనికి "బ్యూటీ" అనే పేరుపెట్టారు.

ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి, దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీర శంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ చిత్రం మే 2 నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధం మనోహర్ సినిమాటోగ్రాఫర్.

డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ సినిమాను, కేవలం 2 షెడ్యూల్స్ లో పూర్తిచేయాలని భావిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారు.

First Published:  22 April 2024 5:19 PM GMT
Next Story