Telugu Global
Cinema & Entertainment

Rao Ramesh | రావు రమేష్ పారితోషికం ఎంత?

Rao Ramesh remuneration - ఒక సినిమాకు వర్క్ చేయడానికి రావు రమేష్ ఎంత తీసుకుంటారు? సినిమా సినిమాకు ఆయన పారితోషికం మారుతుందా?

Rao Ramesh | రావు రమేష్ పారితోషికం ఎంత?
X

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అత్యథికంగా పారితోషికం తీసుకుంటున్న నటుడు రావురమేష్ అంట. రోజులో ఒక కాల్షీట్ కు ఆయన నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటున్నారట. టాలీవుడ్ లో ఇదే అత్యథికం అంట.

ఇలా రావు రమేష్ పై చాలా ఊహాగానాలున్నాయి. మరి అందులో నిజం ఎంత? ఆయన నిజంగానే కాల్షీట్ కు నాలుగున్నర లక్షలు తీసుకుంటున్నారా? దీనిపై స్వయంగా ఆయనే స్పందించారు.

"నాలుగున్నర కూడా తక్కువ. ఎక్కడా ఆగలేం. టీవీలో చేసినప్పుడు వెయ్యి అడిగితే ఎక్కువన్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత 10వేలు అడిగితే ఎక్కువన్నారు. ఈ 'ఎక్కువ' అనే కంప్లయింట్ ఎప్పుడూ ఉంటుంది. రోజుకు నాలుగున్నర లక్షల కంటే ఇంకా ఎక్కువ తీసుకున్నాను. అంతా ఊహించిన దానికంటే ఎక్కువే తీసుకున్నాను. అంతా వైట్ మనీనే. ప్రతి పైసాకు ట్యాక్స్ కూడా కట్టాను. కానీ పరభాషా క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోలిస్తే తెలుగు ఆర్టిస్టులకు ఎప్పుడూ తక్కువే ఉంటుంది. ఇది గమనించాలి."

ఇలా తన రెమ్యూనరేషన్ పై స్పందించారు రావు రమేష్. మనం వంద రూపాయలు అడిగితే 50 నుంచి బేరం మొదలుపెడతారని, అందులో తప్పులేదని అన్నారు. ప్రతి సినిమాకు ఒకే రెమ్యూనరేషన్ ఉండదని.. ముందు పాత్ర నచ్చాలని, ఆ తర్వాత వయా మీడియాగా ఓ మొత్తం అనుకుంటామని అన్నారు. అంతా అనుకున్న తర్వాత కూడా కొంత కట్ చేసి చేతిలో పెట్టిన సందర్బాలూ ఉన్నాయన్నారు.

"బయటవాళ్లు నా కంటే 2-3 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. వాళ్ల గురించి ఎవ్వరూ రాయట్లేదు. తెలుగోడ్ని కదా అందుకే నన్ను అంటారు. వాళ్లకు ఆ చనువు ఉంది. మనోడు అనే చనువు. ఈ మాట ఎంత ప్రమాదమంటే, మనోడు అంటే వాడికి ఏం ఇవ్వరు. మనోడు అనుకుంటే వాడికి కారు పంపించరు, రెమ్యూనరేషన్ ఉండదు. మురళీశర్మ, నేను కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. కాకపోతే అది మరీ అసాధారణం కాదు. మాకంటే నాలుగింతలు తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు. ఆ రేట్లు చెబితే మీకు నమ్మశక్యం కాదు. అలా అని ఆ పారితోషికాలతో కంపేర్ చేసుకొని మరీ అంత బుద్ధిహీనంగా కూడా నేను అడగను."

తెలుగు రాకుండా, ప్రామ్టింగ్ మీద నటించే వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించిన రావు రమేష్, అందులో తప్పు లేదన్నారు. దర్శకుడికి ఎవరు కావాలో, వాళ్లు ఎక్కడున్నా తెచ్చి పెట్టుకుంటాడని, మనం అన్నపూర్ణ స్టుడియోస్ పక్కన ఇల్లు కట్టుకున్నా మనల్ని పిలవరని అన్నారు.

First Published:  28 Aug 2024 8:29 AM GMT
Next Story